వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి భూ వివాదంలో ప్రహరీ గోడను కూల్చినందుకు, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు రూ. 50 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్‌కు చెల్లించాలని, ఆ తర్వాతే కౌంటర్ అఫిడవిట్ స్వీకరించాలని రిజిస్ట్రీని కోర్టు ఆదేశించింది.
స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు నిబంధనలను అతిక్రమించారని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం మరియు బాధ్యతారాహిత్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...

