వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచ పట్టణంతో పాటు మండలంలో బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వివిధ పనులకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షాలతో పత్తి, మొక్కజొన్న, మిరప, వరి పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

