Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో భారీ వర్షం: తడిసిన ధాన్యం

Follow Udayam on Google
Ravi Shukla May 27, 2026 11:57 AM మెదక్General
మెదక్‌లో భారీ వర్షం: తడిసిన ధాన్యం - Udayam
మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. గాలివాన ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం, లారీలు రాకపోవడంతోనే ఈ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంటా వేసిన బస్తాలు కూడా వర్షంలోనే ఉండిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Comments

G
Loading comments...