వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు మండలంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దట్టమైన మబ్బులతో వాతావరణం చల్లబడటంతో ఉక్కపోతతో ఇబ్బందిపడిన ప్రజలకు ఉపశమనం లభించింది.
సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వర్షం ఊరటనిచ్చింది. ఎండిపోతున్న పంటలకు వర్షం ప్రాణాధారంగా మారిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూలీలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

