వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో గడచిన నాలుగు రోజుల్లో 11 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటడంతో జనం అల్లాడుతున్నారు. వడదెబ్బ మరణాలకు ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం అందిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు వెళ్లవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తగినంత నీరు, ఓఆర్‌ఎస్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

