వార్తలకు తిరిగి వెళ్లండి

గత భారాస ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించామని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మాత్రం ఎలాంటి పురోగతి లేదని, ప్రాజెక్టుల విషయంలో కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని హరీశ్ ఆరోపించారు. సోలార్ ఆధారిత విద్యుత్ విధానాలతో సాగునీటి రంగానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తూ, రైతు డిస్కం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సీఎంకు లేఖ రాశారు.
Comments
Loading comments...

