Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాటర్‌ బోర్డు పేరుతో సైబర్ మోసాలు

Follow Udayam on Google
Ravi Shukla Jun 06, 2026 1:07 PM హైదరాబాద్General
వాటర్‌ బోర్డు పేరుతో సైబర్ మోసాలు - Udayam
వాటర్‌ బోర్డు పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. మీటర్ అప్‌డేట్, బిల్లు వెరిఫికేషన్ పేరుతో మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేసి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. వాటర్ కనెక్షన్ నిలిపివేస్తామంటూ నమ్మించి బాధితుల నుంచి వేల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ఇటువంటి నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని తెలియజేయవద్దని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...