వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ప్రతిపాదించిన 'రైతు డిస్కం' ఒక తుగ్లక్ చర్య అని, ఇది అన్నదాతల పాలిట ఉరితాడుగా మారనుందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణం చేయాలని ఆయన సవాలు విసిరారు.
కొత్త విధానం వల్ల రైతులకు గ్యారంటీ లేని సోలార్ విద్యుత్ మాత్రమే అందుతుందని, దీనివల్ల 8 గంటలకంటే ఎక్కువ కరెంటు రాదని ఆరోపించారు. ఈ రైతు డిస్కం నిర్ణయాన్ని విరమించుకోకపోతే భారాస ఆధ్వర్యంలో మరో విద్యుత్ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

