వార్తలకు తిరిగి వెళ్లండి

గండిపేట ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు నకిలీ జీవోలు, తప్పుడు పత్రాలను సృష్టించిన కేసులో ప్రధాన నిందితుడు వెలది రాధాకృష్ణ, అతని డ్రైవర్ ప్రవీణ్ కుమార్‌లను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయ మాజీ ఉద్యోగిగా పరిచయాలు పెంచుకున్న రాధాకృష్ణ, గతంలోనూ పలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో ఒప్పందం చేసుకుని రూ. 12 కోట్ల లావాదేవీలు జరిపినట్లు తేలింది. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, నకిలీ స్టాంపులు, పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

