Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు

Follow Udayam on Google
Uday Bhaskar Sep 23, 2026 6:46 PM రంగారెడ్డిGeneral
హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు - Udayam
సెప్టెంబర్‌ 25న జరగనున్న మహానిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్‌ సిటీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయగా.. బందోబస్తుకు 20 వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు. ప్రధాన మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతతో పాటు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టారు. భక్తులు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...