వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల అరుదైన రికార్డు సృష్టించింది. ఇక్కడ చదివిన ఎనిమిది మంది పూర్వ విద్యార్థులు దేశ నాలుగో అత్యున్నత పురస్కారమైన ‘పద్మశ్రీ’ని సొంతం చేసుకుని ఈ ఘనత సాధించారు.
1946లో ఏర్పాటైన ఈ కళాశాల ఎందరో వైద్య నిపుణులను తీర్చిదిద్దింది. పద్మశ్రీ సాధించిన వారిలో సి.ఎం.హబీబుల్లా, బి.సోమరాజు, జి.ఎన్.రావు, వై.నాయుడమ్మ వంటి ప్రముఖులు ఉన్నారు.
Comments
Loading comments...

