వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూ కశ్మీర్‌లోని గుల్మార్గ్ గోండోలా కేబుల్ కార్ సర్వీసుల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో దాదాపు 300 మంది పర్యాటకులు గాల్లోనే చిక్కుకుపోయారు. సోమవారం జరిగిన ఈ ప్రమాదంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గంటల తరబడి గాల్లోనే వేచి ఉండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలను వేగవంతం చేశారు.
ఆర్మీ, పోలీసులు రంగంలోకి దిగి పర్యాటకులను సురక్షితంగా కిందకు దించుతున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సీఎం ఒమర్ అబ్దుల్లా అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

