వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల గోవింద నామస్మరణల మధ్య వేలాది మంది రథాన్ని లాగారు. ఈ ఉత్సవం శరీరాన్ని రథంతో పోల్చుతూ భక్తులకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుందని పండితులు పేర్కొన్నారు.
రథోత్సవం అనంతరం స్వామివార్లకు పాలు, పెరుగు, చందనంతో స్నపన తిరుమంజనం (అభిషేకం) నిర్వహించారు. శనివారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
Comments
Loading comments...

