వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం లక్ష్మణచందా మండలం తిరుపల్లి గోదామును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలపై ఆరా తీస్తూ, పనుల్లో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.
అవసరమైతే అదనపు హమాలీలను నియమించి, ట్రాక్టర్ల క్యూను తగ్గించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

