Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ప్రభుత్వ బడిలో చేరితే రూ.2 వేలు

Rohit Jun 13, 2026 6:13 PM కరీంనగర్ 17 views1 day ago
ప్రభుత్వ బడిలో చేరితే రూ.2 వేలు - Udayam Digital
తన ఊరిలోని ప్రభుత్వ పాఠశాల మూతపడకుండా కాపాడుకునేందుకు పెద్దపల్లి జిల్లా శానగొండ గ్రామ సర్పంచి జీల రాజు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గతేడాది కేవలం ఐదుగురు విద్యార్థులే ఉన్న ఈ ప్రాథమిక పాఠశాలలో, ఈ ఏడాది ప్రవేశాలు పెంచేందుకు బడిలో చేరే ప్రతి విద్యార్థికి రూ.2,000 నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. శనివారం ఉపాధ్యాయులతో కలిసి 'బడి బాట' నిర్వహించిన ఆయన, దసరా నాటికి ఈ నగదు అందిస్తామని చెప్తూ.. ఉచిత పుస్తకాలు, దుస్తులు, నాణ్యమైన భోజన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...