Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్కారు పట్టించుకోలేదు: ఊరంతా కలిసి బడిని కట్టేశారు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 03, 2026 10:48 AM జాతీయంGeneral
సర్కారు పట్టించుకోలేదు: ఊరంతా కలిసి బడిని కట్టేశారు - Udayam
మధ్యప్రదేశ్ దిండోరి జిల్లా శికారితోలాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పు ఊడిపోవడంతో 52 మంది గిరిజన విద్యార్థులు ఒకే గదిలో తీవ్ర ఇబ్బందుల నడుమ చదువుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా గ్రామస్తులే విరాళాలు సేకరించి, శ్రమదానం చేస్తూ సొంతంగా పాఠశాలను నిర్మిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం గిరిజన గ్రామం ఏకమై చేస్తున్న ఈ కృషి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

Comments

G
Loading comments...