Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపిక ఆరోగ్యం మరింత మెరుగుపడింది: నారా లోకేశ్‌

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:33 PM అమరావతిGeneral
గోపిక ఆరోగ్యం మరింత మెరుగుపడింది: నారా లోకేశ్‌ - Udayam
అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆమె కుర్చీలో సౌకర్యంగా కూర్చుంటోందని, వైద్యులు ఘన ఆహారం అందించడం ప్రారంభించారని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. త్వరలోనే ఆమె నడవగలదని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. ప్రార్థనలు చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...