వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరం నుండి 11 కొత్త అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ మూడేళ్ల కోర్సులో భాగంగా చివరి ఏడాది విద్యార్థులు వివిధ కంపెనీల్లో శిక్షణ పొందుతూ నెలకు రూ. 7 వేల స్టైపెండ్ అందుకుంటారు. విద్యార్థులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
ఈ ఏడాది 11 వేల సీట్లను అందుబాటులోకి తెచ్చారు. జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి.
Comments
Loading comments...

