Back to feed
గోదావరి కాలుష్యం: పవన్ ఆగ్రహం
Ravi Gupta May 26, 2026 5:40 AM అమరావతి 18 views1 day ago

ఆంధ్రాపేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వెంకటనగరం వద్ద ఈ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి కాలుష్య నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని పవన్ స్పష్టం చేశారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటనలో మంత్రులు మనోహర్, దుర్గేశ్ ఆయన వెంట ఉన్నారు.
Comments
Loading comments...



