వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 25, 26, 27 తేదీల్లో రాత్రివేళ ప్రత్యేక MMTS రైళ్లను నడపనుంది.
రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్య 8 ప్రత్యేక MMTS రైళ్లు నడవనున్నాయి. ఇవి సికింద్రాబాద్, HYD, లింగంపల్లి ఫలక్‌నుమా ప్రాంతాల మధ్య ప్రయాణిస్తాయి. ఆ మార్గాల్లో అన్ని MMTS స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

