వార్తలకు తిరిగి వెళ్లండి

కపిలేశ్వరపురం మండలం టేకి-అంగర ఆర్‌అండ్‌బీ రహదారిలో పడమర కండ్రిక ప్రవేశం వద్ద చెత్త కుప్పలు పేరుకుపోయాయి. పంచాయతీ సిబ్బంది గ్రామంలో సేకరించిన చెత్తను అక్కడే వేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. చెత్త కుళ్లి దుర్వాసన వస్తోందని, గాలులకు ప్రయాణికులపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

