వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ మండలం కొంటూరు చెరువు వద్ద బుధవారం ఉదయం నుంచి వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది. భారీ విగ్రహాలను క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది.
నిమజ్జనం సమయంలో ఎవరూ నీటిలోకి దిగవద్దని అధికారులు సూచించారు. పలువురు భక్తులు నిమజ్జన దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

