వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా కాసులపల్లిలో గడ్డిమందు పిచికారీ మెషిన్‌తో ఆడుకుంటూ ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పొలం నుండి తెచ్చిన స్ప్రేయర్ మెషిన్‌ను తాకడంతో అకీరా నందన్, కార్తికేష్, రితిక్ ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గమనించిన కుటుంబసభ్యులు వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం చిన్నారులకు కరీంనగర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో బాధితుల కుటుంబాలలో మరియు గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
Comments
Loading comments...

