వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిప్పికొట్టారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రానున్న రెండేళ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
తిరుమలాయపాలెంలో పలు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు వ్యవసాయాధికారుల సలహాలు పాటించాలని సూచించారు. విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు నియోజకవర్గంలో భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
Comments
Loading comments...

