Back to feed
ఎత్తిపోతల పథకాల రిపేర్లకు నిధులు మంజూరు
Ritika Suri May 27, 2026 9:13 AM హైదరాబాద్ 13 viewsabout 11 hours ago

మదనాపురం మండలంలోని సరళ సాగర్, కురుమూర్తి రాయ, నెలివిడి ఎత్తిపోతల పథకాల రిపేర్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ పథకాల పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు.
దీని ప్రకారం సరళ సాగర్ లిఫ్ట్‌కు రూ.1.94 కోట్లు, కురుమూర్తి రాయ లిఫ్ట్‌కు రూ.1.45 కోట్లు, నెలివిడి లిఫ్ట్‌కు రూ.92 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఎత్తిపోతల పథకాలకు త్వరలోనే రిపేర్లు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.
Comments
Loading comments...



