Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం

Follow Udayam on Google
Rohit Jun 16, 2026 3:10 PM అమరావతిGeneral
నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం - Udayam
నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాల్ టికెట్ చూపిస్తే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. జూన్ 21న జరగనున్న పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులపై భారం తగ్గించేలా ఈ సదుపాయాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...