వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలో తల్లి లయ (31) తన ముగ్గురు పిల్లలతో కలిసి ఒకేసారి అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. కనిపించకుండా పోయిన వారిలో 16 ఏళ్ల బిందు, 13 ఏళ్ల శివ, 8 ఏళ్ల దివిజ ఉన్నారు.
బాధితులు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాల వల్లే వారు ఇల్లు వదిలి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

