వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో విద్యా, వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించి పాఠశాలల స్థితిగతులపై ఆరా తీశారు. పదో తరగతి ఫలితాల శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.
మెట్‌పల్లి సామాజిక ఆసుపత్రిలో వైద్యులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రి భవన పనులను వేగవంతం చేసి, త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
Comments
Loading comments...

