Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3-F ఫార్ములాపై దృష్టి: నిర్మలా సీతారామన్

Follow Udayam on Google
Sana Khan May 25, 2026 5:00 PM జాతీయంGeneral
3-F ఫార్ములాపై దృష్టి: నిర్మలా సీతారామన్ - Udayam
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకొని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గిస్తే ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుందని ఆమె తెలిపారు. సిడ్బీ 37వ వార్షికోత్సవంలో మాట్లాడిన మంత్రి.. దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కోబోతోందంటూ ఇటీవల రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాజకీయాల కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తగదని హితవు పలికారు.

Comments

G
Loading comments...