Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జిలు

Follow Udayam on Google
Sonia Singh May 28, 2026 10:27 AM జాతీయంGeneral
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జిలు - Udayam
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురిని నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు సీనియర్‌ న్యాయవాది వి. మోహన ఉన్నారు. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని కొలీజియం మే 22, 27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వచ్చే నెలలో ఇద్దరు సిట్టింగ్‌ జడ్జిలు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఈ తాజా నియామకాలు కీలక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Comments

G
Loading comments...