వార్తలకు తిరిగి వెళ్లండి
దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం

భారతదేశంలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి రైలును ప్రధాని నరేంద్ర మోదీ హరియాణాలోని జీంద్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు శుద్ధ, భవిష్యత్ రవాణా వ్యవస్థల పట్ల దేశ నిబద్ధతకు, ఆత్మనిర్భర భారత్‌కు సగర్వ చిహ్నమని ఆయన ఉద్ఘాటించారు.
ఈ ఆవిష్కరణతో హైడ్రోజన్ రైళ్లు కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరిందని ప్రధాని తెలిపారు. ఇదే వేదికగా జీంద్‌లో రూ.14,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Comments
Loading comments...