వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో వాతావరణశాఖ రాష్ట్రంలోనే మొదటిసారిగా 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. మరో నాలుగు రోజులపాటు అతి తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరించింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఈ అత్యంత ప్రమాదకర హెచ్చరికలు వర్తిస్తాయి.
మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా కరీంనగర్, వరంగల్ సహా ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, నిజామాబాద్, జగిత్యాల వంటి ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

