Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు

Follow Udayam on Google
Priya Desai May 26, 2026 1:07 PM హైదరాబాద్General
ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు - Udayam
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో మంగళవారం ఉదయం గద్వాల డిపో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో ఒక్కసారిగా పొగలు, మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో బస్సు దిగి పరుగులు తీశారు. అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది వెంటనే నీళ్లను ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో బస్టాండ్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. బస్సులో సాంకేతిక లోపం వల్లే మంటలు వచ్చినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Comments

G
Loading comments...