వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా కవిటి తీరంలో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 8 మత్స్యకార కుటుంబాల బోట్లు, వలలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 1.50 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. జీవనాధారాన్ని కోల్పోయిన మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఆర్థిక సాయం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారని వారు ఆవేదన చెందారు.
Comments
Loading comments...

