Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనల్లో భారత్‌-ఎ

Follow Udayam Digital on Google
Sonia Singh Jun 18, 2026 10:36 AM ఆల్ ఇండియాక్రీడలు
ఫైనల్లో భారత్‌-ఎ - Udayam Digital
ముక్కోణపు టోర్నీలో చావోరేవో పోరులో అదరగొట్టిన ఇండియా-ఎ జట్టు 101 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్-ఎను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన తిలక్‌వర్మ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రియాంశ్, తిలక్, కుశాగ్ర అర్ధసెంచరీలతో రాణించగా.. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ 218 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ నిశాంత్ సింధు 4 వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

Comments

G
Loading comments...