వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు మహేంద్ర దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా యూరియా ధరలు సగానికి తగ్గడంతో ఎరువుల సబ్సిడీ భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా సేంద్రీయ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
పప్పుధాన్యాల నిల్వలు పుష్కలంగా ఉన్నందున ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదని ఆయన తెలిపారు. పశ్చిమ ఆసియా యుద్ధ సంక్షోభం, ఎల్-నినో ప్రభావం ఉన్నప్పటికీ.. ఆర్‌బీఐ అంచనా వేసిన 6.6 శాతం వృద్ధి రేటు, 5.1 శాతం ద్రవ్యోల్బణం సాధ్యమేనని అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

