వార్తలకు తిరిగి వెళ్లండి

రామారం రైస్ మిల్లు వద్ద ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం జరుగుతోందని రాయపోలు మండలం చేగుంట రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. గత మూడు, నాలుగు రోజులుగా ధాన్యం దించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ నిరసనతో రహదారిపై రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది.
Comments
Loading comments...

