Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లోనే డబ్బులు

Follow Udayam on Google
Rohit Singh May 29, 2026 4:20 PM హైదరాబాద్General
ధాన్యం రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లోనే డబ్బులు - Udayam
తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రూ.11,050 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని, చివరి గింజ వరకు మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. యాసంగిలో ఇప్పటివరకు 73 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుండి ధాన్యం కొనుగోళ్లను తగ్గించిందని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...