Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అకాల వర్షంతో రైతన్న హైరానా

Follow Udayam on Google
Ravi Shukla May 30, 2026 12:26 PM మహబూబ్‌నగర్General
అకాల వర్షంతో రైతన్న హైరానా - Udayam
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం శుక్రవారం అయిజ మున్సిపాలిటీని ముంచెత్తింది. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వరద నీరు నిలిచిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. 38.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, అకాల వర్షంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...