వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ సీనియర్ గాయని సుమన్ కళ్యాణ్‌పుర్ (89) ముంబయిలోని తన నివాసంలో నిన్న కన్నుమూశారు. 1950 నుండి 1970ల మధ్య హిందీ, మరాఠీ భాషల్లో వందలాది మధురమైన పాటలు పాడి ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె స్వరం లతా మంగేష్కర్ వాయిస్‌ను పోలి ఉండేది.
"ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చా" వంటి ఎన్నో ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్ ఆమె పాడారు. సుమన్ కళ్యాణ్‌పుర్ మృతి పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

