వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాల ముఠా కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో దందా చేస్తోంది. సరిహద్దుల్లో పోలీసు నిఘా వైఫల్యంతో, ఏటా భారీగా నకిలీ విత్తనాలు జిల్లాకు చేరుతున్నాయి. నామమాత్రపు కేసులతోనే నిందితులు బయటపడుతుండటంతో అక్రమ రవాణా కొనసాగుతోంది.
గత కొన్నేళ్లుగా కోట్ల విలువైన విత్తనాలు పట్టుబడుతున్నా, నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే రైతులకు మేలు జరుగుతుందని కోరుతున్నారు.
Comments
Loading comments...

