Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు

కిషోర్ కుమార్ Jun 27, 2026 5:39 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు - Udayam Digital
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే వేసవి ప్రత్యేక రైళ్ల గడువును ఆగస్టు మొదటి వారం వరకు పొడిగించింది. ఆనంద్ విహార్-రాంచీ సహా మొత్తం 10 ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్ల సమయాలు, స్టేషన్లలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ప్రయాణికులు 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయడం లేదా అధికారిక వెబ్‌సైట్, రైల్ మదాద్ యాప్‌ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...