Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోయలో కారు పడి 8 మంది మృతి

Follow Udayam on Google
Sonia Singh May 26, 2026 2:30 PM జాతీయంGeneral
లోయలో కారు పడి 8 మంది మృతి - Udayam
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా అంబెనాలి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. దాపోలి నుంచి సతారా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు సోమవారం ఉదయం లోయలో వాహనాన్ని గుర్తించారు. మృతులంతా 19 నుండి 35 ఏళ్ల లోపు వయసున్న యువకులు కాగా, ఈ ప్రమాదంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...