వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ స్కాంలో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు, మైనింగ్ లీజుల్లో జరిగిన అవకతవకలపై ఏకకాలంలో హైదరాబాద్, విజయవాడ, జైపూర్, కోయంబత్తూరులలో అధికారులు సోదాలు నిర్వహించారు.
మాజీ మైన్స్ డైరెక్టర్ వి.జి. వెంకటరెడ్డితో పాటు జేపీవీఎల్, ప్రతిమా ఇన్‌ఫ్రా సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. వెంకటరెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ గుర్తించింది.
Comments
Loading comments...

