వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సూడాన్, కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు.
వైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్ చేయాలని, ఓడరేవులు, రోడ్డు మార్గాలపై నిఘా పెట్టాలని సూచించారు. డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ఈ వైరస్ సోకితే తీవ్ర జ్వరం, రక్తస్రావం జరిగి 50 శాతం మరణాలు సంభవించే ప్రమాదముంది.
Comments
Loading comments...

