Back to feed
ఈ-పాస్ గడువు పొడిగింపు
Rohit Singh May 26, 2026 6:25 AM హైదరాబాద్ 20 views1 day ago

తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ (ఫ్రెష్, రెన్యూవల్) దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఏప్రిల్ 20తో ముగియాల్సిన ఈ గడువును విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా మే 31 వరకు పొడిగించారు. అర్హులైన విద్యార్థులు తెలంగాణ ఈ-పాస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...



