వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా గర్రెపల్లికి చెందిన కడ్డీ తంత్రి కళాకారుడు దురిచేటి రామయ్య కేంద్ర ప్రభుత్వ పురస్కార్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ వార్తతో గ్రామంలో ఆనందం వ్యక్తమైంది. రామయ్య ఇంటికి వెళ్లిన గ్రామస్తులు, ఆయనను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
నిరుపేద కళాకారుడైన రామయ్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. తన అద్భుతమైన కళా నైపుణ్యంతో ప్రాంతానికి పేరు తెచ్చిన రామయ్యకు దక్కిన ఈ గుర్తింపు పట్ల స్థానికులు గర్వపడుతున్నారు.
Comments
Loading comments...

