వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 199 మందిలో నలుగురికి రెండు రోజుల జైలు శిక్ష, 195 మందికి రూ.20.35 లక్షల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం తెలిపారు.
సెప్టెంబర్ 1 నుంచి 22 వరకు నగరంలోని 6 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

