వార్తలకు తిరిగి వెళ్లండి

పాములపాడు మండలం జూటూరు రజక కాలనీలో 20 రోజులుగా తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. త్రీఫేజ్ విద్యుత్ లైన్ స్తంభం ఏర్పాటు సమయంలో పైప్‌లైన్ దెబ్బతినడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు తెలిపారు.
సమస్యను కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే పైప్‌లైన్ మరమ్మతులు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
Comments
Loading comments...

