వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండకు చెందిన ప్రముఖ ప్రసూతి, స్త్రీ రోగ వైద్య నిపుణురాలు డాక్టర్ సైకం శ్రీలత నాయుడు ప్రతిష్ఠాత్మక 'ఎంఆర్‌సీఓజీ' (MRCOG) అంతర్జాతీయ అర్హతను సాధించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టెట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ఈ గుర్తింపును అందించింది.
గత పదేళ్లుగా నల్లగొండలో వైద్య సేవలు అందిస్తున్న ఆమె, వంధ్యత్వ చికిత్సలు మరియు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సల్లో విశేష కృషి చేస్తున్నారు. ఆమె సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు జిల్లా వైద్య రంగానికి గర్వకారణమని సహచర వైద్యులు, ప్రముఖులు అభినందించారు.
Comments
Loading comments...

